పదో తరగతి పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు
చైతన్య హైస్కూల్‌పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): పట్టణంలోని చైతన్య హైస్కూల్ యాజమాన్యం పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతోందని పట్టణ కార్యదర్శి దుర్గరాజ్ కామెర ఆరోపించారు. సోమవారం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాములుకు వినతిపత్రం సమర్పించి, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దుర్గరాజ్ కామెర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు రూ.125 ఫీజు...