శ్రావణపల్లి OCP, కోయగూడెం బ్లాక్–IIIపై కేంద్రం పునరాలోచించాలి
AITUC రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

తెలంగాణలోని బొగ్గు వనరులు సింగరేణి సంస్థకే చెందేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ .చేశారు. శుక్రవారం ఆయన మందమర్రిలో కోల్ బెల్ట్ న్యూస్ తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 26వ ట్రాంచ్ ఆఫ్ కోల్ మైన్స్ ఆక్షన్‌లో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి OCP, కోయగూడెం బ్లాక్–III బొగ్గు బ్లాకులను కూడా వేలానికి పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు. తెలంగాణలో బొగ్గు వనరులను సింగరేణి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం ద్వారా సంస్థ విస్తరణతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయన్నారు.
వేలంపాట ప్రక్రియను నిలిపివేయాలి……
వేలంపాట ప్రక్రియను కేంద్రమే పరిశీలించి, సింగరేణి యాజమాన్యానికి బొగ్గు బ్లాకులను దక్కేలా చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణలో చురుగ్గా పనిచేస్తున్న సింగరేణి సంస్థకు రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను కేటాయించాలనేది తమ యూనియన్ ప్రధాన డిమాండ్ అన్నారు.
కార్మికుల ఉపాధికి భరోసా కల్పించాలి…..
శ్రావణపల్లి OCP, కోయగూడెం బ్లాక్–IIIలో వేలం భవిష్యత్తులో తెలంగాణలోని బొగ్గు బ్లాకులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆవేదన చేశారు. సింగరేణి సంస్థను బలోపేతం చేస్తూ కార్మికుల ఉపాధికి భరోసా కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

