NIGAMA MEDIA (P) LTD
22.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 15, 2026

బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌లోకి బస్సులు నడపాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

వర్షం, ఎండలో ప్రయాణికులు, విద్యార్థుల అవస్థలు

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):

బెల్లంపల్లిలోని కొత్త బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయూ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బస్సులను బస్టాండ్‌ వెలుపల రోడ్డుపైనే నిలిపివేస్తుండటంతో పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఎంసీపీఐయూ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసలేటి వెంకటేష్ మాట్లాడుతూ.. వర్షం పడినప్పుడు ప్రయాణికులు తడుస్తూ, ఎండ సమయంలో ఎండకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్టాండ్‌ ఉన్నప్పటికీ బస్సులు లోపలికి రాకపోవడంతో ప్రజలకు దాని ప్రయోజనం అందడం లేదన్నారు.

బస్టాండ్‌ లోపల బస్సులు సురక్షితంగా రాకపోవడానికి గల కారణాలను నిపుణులతో పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఆసిఫాబాద్‌ డిపో మేనేజర్‌తో పాటు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రయాణికులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా బస్సులను బస్టాండ్‌లోపలికి నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంసీపీఐయూ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, బెల్లంపల్లి మండల కార్యదర్శి తోగరి రాహుల్, రాజేష్, శేఖర్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.