బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌లోకి బస్సులు నడపాలి
వర్షం, ఎండలో ప్రయాణికులు, విద్యార్థుల అవస్థలు కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): బెల్లంపల్లిలోని కొత్త బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయూ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బస్సులను బస్టాండ్ వెలుపల రోడ్డుపైనే నిలిపివేస్తుండటంతో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంసీపీఐయూ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసలేటి వెంకటేష్ మాట్లాడుతూ.. వర్షం పడినప్పుడు ప్రయాణికులు...