NIGAMA MEDIA (P) LTD
26 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, August 19, 2026

కేకే-5 గని ఉత్తమ కార్మికులకు ఘన సన్మానం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ఉత్తమ సింగరేణియన్, ఉత్తమ సింగరేణి కార్మికులుగా అవార్డులు అందుకున్న కేకే-5 గని కార్మికులను మంగళవారం ఉదయం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

కేకే-5 గని వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ సింగరేణియన్ అవార్డు గ్రహీత మురుకుంట్ల మల్లేష్ (కోల్ కట్టర్), **మందమర్రి ఏరియా ఉత్తమ సింగరేణి కార్మికులుగా అవార్డు పొందిన మంద అనిల్ కుమార్ (కోల్ కట్టర్), బత్తిని అంజయ్య (సపోర్ట్‌మ్యాన్)**లను కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల సమక్షంలో శాలువాలతో సత్కరించారు. అనంతరం మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అవార్డులు సాధించిన కార్మికులు ఇతర కార్మికులకు స్ఫూర్తిగా నిలిచారని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్మికుల సమష్టి కృషి, క్రమశిక్షణతోనే సంస్థ మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.