కేకే-5 గని ఉత్తమ కార్మికులకు ఘన సన్మానం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఉత్తమ సింగరేణియన్, ఉత్తమ సింగరేణి కార్మికులుగా అవార్డులు అందుకున్న కేకే-5 గని కార్మికులను మంగళవారం ఉదయం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కేకే-5 గని వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ సింగరేణియన్ అవార్డు గ్రహీత మురుకుంట్ల మల్లేష్ (కోల్ కట్టర్), **మందమర్రి ఏరియా ఉత్తమ సింగరేణి కార్మికులుగా అవార్డు పొందిన మంద అనిల్ కుమార్ (కోల్ కట్టర్), బత్తిని అంజయ్య (సపోర్ట్‌మ్యాన్)**లను కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల సమక్షంలో శాలువాలతో సత్కరించారు. అనంతరం మిఠాయిలు తినిపించి అభినందనలు...