నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
కోల్ బెల్ట్ న్యూస్(రామకృష్ణాపూర్):
క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు రజియా పరమపదించడంతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజియా పార్థివదేహానికి నివాళులర్పించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రజియా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాల్క సుమన్, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో రజియా చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆమె మరణం పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు.మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

