కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఉత్తమ సింగరేణియన్, ఉత్తమ సింగరేణి కార్మికులుగా అవార్డులు అందుకున్న కేకే-5 గని కార్మికులను మంగళవారం ఉదయం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కేకే-5 గని వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ సింగరేణియన్ అవార్డు గ్రహీత మురుకుంట్ల మల్లేష్ (కోల్ కట్టర్), **మందమర్రి ఏరియా ఉత్తమ సింగరేణి కార్మికులుగా అవార్డు పొందిన మంద అనిల్ కుమార్ (కోల్ కట్టర్), బత్తిని అంజయ్య (సపోర్ట్‌మ్యాన్)**లను కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల సమక్షంలో శాలువాలతో సత్కరించారు. అనంతరం మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అవార్డులు సాధించిన కార్మికులు ఇతర కార్మికులకు స్ఫూర్తిగా నిలిచారని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్మికుల సమష్టి కృషి, క్రమశిక్షణతోనే సంస్థ మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});