కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
గ్రామ ప్రజల సౌకర్యార్థం బీబీపేట నుంచి హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్‌కు రేపటి నుంచి బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఉదయం 7:30 గంటలకు బీబీపేట నుంచి బయలుదేరే బస్సు ఉప్పరపల్లి, ఇస్సానగర్, కంచర్ల, పెద్దమల్లారెడ్డి, రామాయంపేట మీదుగా హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్‌కు చేరుకుంటుంది.
అదేవిధంగా హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమై రామాయంపేట, పెద్దమల్లారెడ్డి, కంచర్ల, ఇస్సానగర్, ఉప్పరపల్లి మీదుగా బీబీపేటకు చేరుకుంటుంది. గ్రామ ప్రజలు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ ధర్మగారి రాజగౌడ్ కోరారు.

