NIGAMA MEDIA (P) LTD
26 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, August 19, 2026

కవిత హామీల్లో కేసీఆర్‌ పాత ఫార్ములా!

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: 

తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్వకుంట్ల కవిత ప్రకటిస్తున్న తాజా రాజకీయ కార్యాచరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రక్షణ సేన వేదికగా ఆమె ప్రకటిస్తున్న హామీలు, విమర్శల తీరు గతంలో కేసీఆర్‌ అనుసరించిన రాజకీయ ఫార్ములానే గుర్తు చేస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

భూమిలేని నిరుపేద కుటుంబాలకు ‘భూ లక్ష్మి’ పథకం కింద ఎకరం భూమి ఇస్తామని కవిత ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్‌ దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చినా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత తాజా హామీని కూడా పాత హామీలకు కొత్త రూపంగా కొందరు అభివర్ణిస్తున్నారు.

కేవలం హామీలు ఇవ్వడం కంటే వాటిని ఆచరణలో ఎలా అమలు చేస్తారన్న దానిపై స్పష్టమైన ప్రణాళికను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత వైఫల్యాల నీడను దాటి విశ్వసనీయతను సాధించడంతో పాటు, సమకాలీన సమస్యలకు కొత్త పరిష్కారాలను చూపినప్పుడే కవిత ప్రత్యామ్నాయ నాయకత్వంగా ప్రజల్లో ప్రభావం చూపగలరని అభిప్రాయపడుతున్నారు. లేకపోతే తాజా ప్రకటనలు రాజకీయ ప్రచారానికే పరిమితమయ్యే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.