CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 10:29 pm Posted By: coalbelt 24 News

ఇస్సానగర్‌కు రేపటి నుంచి హైదరాబాద్‌ బస్సు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

గ్రామ ప్రజల సౌకర్యార్థం బీబీపేట నుంచి హైదరాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌కు రేపటి నుంచి బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఉదయం 7:30 గంటలకు బీబీపేట నుంచి బయలుదేరే బస్సు ఉప్పరపల్లి, ఇస్సానగర్, కంచర్ల, పెద్దమల్లారెడ్డి, రామాయంపేట మీదుగా హైదరాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌కు చేరుకుంటుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అదేవిధంగా హైదరాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమై రామాయంపేట, పెద్దమల్లారెడ్డి, కంచర్ల, ఇస్సానగర్, ఉప్పరపల్లి మీదుగా బీబీపేటకు చేరుకుంటుంది. గ్రామ ప్రజలు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ ధర్మగారి రాజగౌడ్ కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});