19.4 C
Munich
Sunday, August 2, 2026

వెండితెరపైకి బాలయ్య తనయ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

స్పోర్ట్స్ డ్రామాతో కథానాయికగా అరంగేట్రం చేసే అవకాశాలు..
అధికారిక ప్రకటనపై అభిమానుల ఆసక్తి
తేజస్విని సినీ ఎంట్రీకి రంగం సిద్ధం!

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని సినీ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. క్రీడా నేపథ్యంతో పాటు బలమైన సామాజిక సందేశాన్ని అందించే స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.

తేజస్విని ఇప్పటివరకు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఎంతో చురుకుగా ఉంటున్నారు. డ్యాన్స్ రీల్స్, బ్రాండ్ ప్రమోషన్లు, వాణిజ్య ప్రకటనల ద్వారా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఆత్మవిశ్వాసాన్ని చూసిన అభిమానులు కూడా గత కొంతకాలంగా ఆమె వెండితెరపై కనిపించాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇక ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చిత్ర యూనిట్ లేదా తేజస్విని కుటుంబ సభ్యుల నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సినీ వర్గాల్లో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.