మెగాస్టార్ చిరంజీవి నటనకు ప్రేక్షకుల బ్రహ్మరథం
ఘనంగా అన్నదానం నిర్వహించిన థియేటర్ యాజమాన్యం, అభిమానులు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఎర్రగుంట్ల పట్టణంలోని హేమ థియేటర్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన “శంకరవరప్రసాద్” చిత్రం విజయవంతంగా 200 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ పొందిన ఈ చిత్రం అరుదైన ఘనతను సాధించడంతో థియేటర్ యాజమాన్యం, చిరంజీవి అభిమానులు సంయుక్తంగా ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అభిమానులు, సినీ ప్రేక్షకులు, స్థానిక ప్రజలకు భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని మెగాస్టార్ చిరంజీవిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ, “శంకరవరప్రసాద్” చిత్రం కథ, చిరంజీవి నటన, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. 200 రోజుల విజయాన్ని సాధించడం చిత్ర విజయానికి నిదర్శనమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యాజమాన్యం, చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});