NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 12, 2026

బీబీపేట్‌లో SIR అవగాహన

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట్):

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న S.I.R. (Special Intensive Revision) కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ-2 కొరివి నీరజ నరసింహులు పాల్గొని మండల వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.

2002 ఓటరు జాబితా ఆధారంగా తమ ఓటును మ్యాపింగ్ చేసుకోవాలని, అలాగే “ఒక ఆధార్ – ఒక ఓటు” అనే నినాదాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ స్థిర నివాసం ఉంటే అక్కడే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని సూచించారు.

నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో మండల ప్రజలందరూ భాద్యతగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు లక్ష్మణ్, భిక్షపతి, రవి, రేణుక, జమున, చంద్రకళతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.