కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట్ మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తుమ్మ మచ్చేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనర్సింలుకు మండల సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా సిరిగాద లక్ష్మీనర్సింలు మాట్లాడుతూ పద్మశాలీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి ఐక్యతే ప్రధాన బలమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు జిల్లా మహిళా సంఘం, యువజన సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, బీబీపేట్ మండలంలోని పద్మశాలీలందరూ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం బీబీపేట్ మండలానికి చెందిన పలువురు నాయకులు పద్మశాలి సంఘంలో కీలక పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా తుమ్మ మచ్చేందర్, జిల్లా ఉపాధ్యక్షుడిగా తుమ్మ రవీందర్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చిలుక భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా అంకాలం నరేందర్, శివరాత్రి లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన నాయకులను జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనర్సింలు అభినందించి, సంఘం అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో మండల నాయకులు అల్వాల నర్సింలు, చింతకింది వేణు, మామిడాల రమేష్, బింగి పెంటప్ప, చందుపట్ల సందీప్, బోడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

