NIGAMA MEDIA (P) LTD
7.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, November 1, 2026

బీసీ కులగణనలో ప్రత్యేక కాలమ్ చేర్చాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతు డిక్లరేషన్లను అమలు చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలను చైతన్యపరుస్తాం
BLF నాయకులు

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్ కేటాయించి, వారి జనాభాతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై సమగ్ర వివరాలు సేకరించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పూలే భవన్‌లో BLF ఆధ్వర్యంలో పసులేటి వెంకటేష్ అధ్యక్షతన శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా BLF రాష్ట్ర కన్వీనర్ సంకె రవి, పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ.. బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయకుండా కేవలం జనాభా లెక్కలు సేకరించడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని అన్నారు. బీసీల జనాభా, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు సంబంధించిన సమగ్ర గణాంకాలు అందుబాటులో లేకపోతే భవిష్యత్తులో బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, పూర్తి స్థాయి వివరాలు సేకరించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు ప్రకటించి అధికారంలోకి వచ్చిందని, అయితే వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.

బీసీ జనగణనలో ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయడంతో పాటు, ఎన్నికల సమయంలో ప్రకటించిన డిక్లరేషన్లను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా BLF ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలను విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో BLF నాయకులు కన్నూరి సమ్మయ్య, దూలం శ్రీనివాస్, ప్రజా ప్రంట్ నాయకులు జైపాల్ సింగ్, IRCP నాయకులు కె. జయరావు, MRPS నాయకులు సుందిల్ల మల్లేష్, సామాజిక సంఘాల నాయకులు సరిత రమాదేవి, మహేందర్, తాడూరి పోచన్న, ధర్మన్న, శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.