NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Singareni : కార్మికులను వేదిస్తే సహించేది లేదు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మూత పడిన గనుల్లో బొగ్గు ఉత్పత్తి
సింగరేణిలో మారు పేర్లతో విధులు నిర్వహించే కార్మికులకు శుభవార్త
INTUC కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య

Singareni : సింగరేణి బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను కొందరు అధికారులు వేధిస్తున్నారని, ఆ పద్దతులను వెంటనే మానుకోవాలని INTUC కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య కోరారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా లోని కాసిపేట ఒకటో గని ఆవరణలో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
యూనియన్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అతి కొద్దీ రోజుల్లోనే మారుపేర్లతో సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు శుభవార్త అందుతుందని అన్నారు. అందుకు తగిన ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి చైర్మన్ కు అందాయన్నారు. హైదరాబాద్ లో కార్మికుల సౌకర్యార్థం ప్రత్యేక ఆసుపత్రి పూర్తి కాబోతున్నదన్నారు. పలు సాంకేతిక కారణాల వలన మూత పడిన గనులను త్వరలోనే ప్రారింభించడానికి యజమాన్యంను ఐఎన్టీయూసీ ఒప్పించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ మిట్ట సూర్యనారాయణ, సెంట్రల్ కమిటీ కార్యదర్శి శంకర్ రావు, ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, ప్రచార కార్యదర్శులు పానుగంటి వెంకట స్వామి, బన్న లక్ష్మన్ దాస్, చారి, కార్యవర్గ సభ్యులు మేడ సమ్మయ్య, ఏరియా నాయకులు భిక్షపతి, సీద్రాల రాజన్న, ఎర్రవెల్లి శంకర్, ఈదునూరి బాపు, పిట్ సెక్రెటరీ శనిగారపు రవీందర్, నాయకులు సోగాల కన్నయ్య, అడెపు శ్రీకాంత్, దినేష్,రాజేశం, సంపత్, అట్లా శ్రీనివాస్, బాల్త శ్రీనివాస్, సంతోష్ పాండే, కమల్,రాజ్ కుమార్, తిరుపతి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.