23.9 C
Munich
Monday, July 27, 2026

Rain : తెలంగాణలో భారీ వర్షాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Rain : తెలంగాణ లో రానున్న ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ రాష్ట్ర వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్న నేపథ్యంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మధ్య తెలంగాణ ప్రాంతాలతో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో అధిక వర్సాలు కురుస్తాయని ప్రకటించింది. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు.

ఉత్తర కోస్తాంధ్ర సమీపాన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతోనే భారీ వర్షాలు రాబోతున్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో తెలంగాణ రైతులు ఆనందంగ ఉన్నారు.

వరుసగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరుగుతాయి. దింతో వ్యవసాయ బావులు, బోర్ బావుల్లో కూడా నీటి మట్టం పెరగనుంది . అదే విదంగా చిన్న, చిన్న నీటి కుంటలు, చెరువులు కూడా నిండే అవకాశాలు ఉన్నవి. తద్వారా రైతులు పొలం పనులు సాగు చేసుకోడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.