NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

actor : టీవీ రిపోర్టర్ గా మొదలైన ఆ ముద్దుగుమ్మ ఆస్తులు చెప్పలేనంత …..

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

actor : చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల లోకంలో అడుగుపెడితే ధనవంతులవుతారు. కొందరు పోటీని తట్టుకోలేక ఇంటికి పయనమవుతారు. వేలకోట్ల ఆస్తులను సంపాదించుకునే వారు ఉన్నారు. అలా సంపాదించుకున్నవారిలో ఓ ముద్దుగుమ్మ కూడా ఒకరు కావడం విశేషం.

ఆ ముద్దుగుమ్మ పుట్టి పెరిగింది శ్రీలంకలో. ఆ తరువాత ఆ దేశంలోనే టీవీ రిపోర్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత మోడల్ గా చేసింది. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని అందుకుంది. ఆ అందాల బొమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ తరువాత తాను ఎంచుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్లింది. సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆమె ఎవరో కాదు. ఆ అందాల ముద్దుగుమ్మ పేరు జాక్వాలిన్ పెర్నాండేజ్‌.

2009లో అలాదిన్ సినిమాతో బాలీవుడ్ వెండి తెరపైకి బ్యూటీ జాక్వాలిన్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత హౌస్ ఫుల్ 2, రేస్ 2 వంటి సినిమాలతో బోలెడంత అభిమానులను సంపాదించుకొంది. వరుసగా చేసిన సినిమాలు పది మాత్రమే. ఆస్తులు మాత్రం కోట్ల కొలది సంపాదించు కొంది. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత జాక్వాలిన్ ఏకంగా 160 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టిందని చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అయ్యింది. అంతే కాదు, ఇంకా చెప్పాలంటే ఈ అందాల ముద్దుగుమ్మ ఏడాది ఆదాయం కూడా రూ.15 కోట్లకు పైగా ఉంటుందని చిత్ర పరిశ్రమలో గుసగుసలు. అదే విదంగా నార్త్ తీరంలో నాలుగు ఎకరాల ఓ ఐలాండ్‌ను 2012లోనే రూ.3.5 కోట్లకు కొనేసిందంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.