NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Singareni : కాసిపేట గనుల పై INTUC సంబరాలు.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : మందమర్రి ఏరియాలోని కాసిపేట – 1, 2 సింగరేణి గనులపై INTUC నాయకులు, కార్యకర్తలు, కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. ఎస్ సి వర్గీకరణ బిల్లు ఆమోదం, బి. సి రిజర్వేషన్లు 23 శాతం నుండి 42 శాతం పెంచడాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభి షేకం చేశారు. ఐఎన్టియుసి కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు, క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కాంపెళ్లి సమ్మయ్య ఈ సందర్బంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు ఆరాధ్యుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ రంగాల్లో విశేషమైన అవకాశాలు వస్తాయన్నారు. 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకై దళిత సోదరులు చేస్తున్న పోరాటాలను నిజం చేస్తూ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి దళితుల ఆశాజ్యోతిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు. కాసిపేట గని కార్మికులను బెదిరింపులకు గురిచేస్తూ, చార్జి షీట్లు, సస్పెన్షన్ చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంపెల్లి సమ్మయ్య ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ కార్యదర్శి పానుగంటి వెంకట స్వామి,కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శులు శంకర్ రావు, బన్న లక్ష్మన్ దాస్, ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, ఏరియా నాయకులు సీద్రాల రాజన్న,పిట్ సెక్రెటరీ శనిగారపు రవీందర్, నాయకులు సోగాల కన్నయ్య, పిట్టల శివ కుమార్, అడెపు శ్రీకాంత్, దినేష్, సంపత్, నాగరాజు, అట్ల సంపత్, ముత్తమల్ల శ్రీనివాస్, బాల్త శ్రీనివాస్, సంతోష్ పాండే, కాసిపేట 2 ఇంక్లైన్ అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ చింతం రవి కిరణ్, గొల్ల రాజేందర్, గణపతి అంజి, కండే నవీన్, రామ్మోహన్, అయిల్లా రవి, రవి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.