22 C
Munich
Monday, July 27, 2026

Singareni : పదోన్నతి పొందిన ఏజెంట్ కు ఘనంగా సన్మానం.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : మందమర్రి ఏరియాలో కేకే గ్రూప్ ఏజెంట్ గా విధులు నిర్వహిస్తున్న రామదాస్ జనరల్ మేనేజర్ గా పదోన్నతి పొంది బదిలీ పై వెళుతున్నారు. ఈ సందర్బంగా రామదాస్ ను కాసిపేట గని అధికారులు, ఉద్యోగులు, సూపర్ వైజర్లు, కార్మికులు, యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మినారాయణ మాట్లాడుతూ నూతన SDL ప్రవేశపెట్టి బొగ్గు ఉత్పత్తి తీయడానికి ఎంతో కృషి చేసారని అన్నారు. ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ బొగ్గు గని ప్రభావిత ప్రాంతాలల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యారని అన్నారు.

మేనేజర్ శంకరయ్య మాట్లాడుతూ ఉత్తమ అధికారిగా అందరికి అందుబాటు లో ఉండటం అభినంద నీయమన్నారు. సలహాలు సూచనలు ఇస్తూ రక్షణ,ఉత్పత్తి లో గనిని ముందువరుసలో ఉంచారన్నారు. అనంతరం జనరల్ మేనేజర్ గా పదోన్నతి పొందిన రామదాసు మాట్లాడుతూ ఈ ప్రాంత ఉద్యోగులు చాలా సౌమ్యులనిన కొనియాడారు. కేటాయించిన పనిని సకాలంలో పూర్తి చేయడంలో ముందుంటారని స్పష్టం చేశారు. కాసిపేట గని కార్మికులు ఎంతో ఆదర్శవంతులని, వీరి నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. కార్మికుల, యూనియన్ నాయకుల సహకారంతో మరింత ముందుకు వెళుతానని అన్నారు.

ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి నిఖిల్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సుమన్, మూర్తి, దిలీప్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్, AITUC నాయకులు రాజేందర్, రవి, అశోక్, రంజిత్, INTUC ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్, కన్నయ్య,TBGKS నాయకులు బైరి శంకర్,చోల్లంకి శ్రీనివాస్, CITU నాయకుడు డెబ్బటి తిరుపతి, SC అసోషియేషన్ నాయకుడు కృష్ణ, ST అసోసియేషన్ నాయకులు దరావత్ తిరుపతి, బాణోత్ తిరుపతి పాల్గొన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.