22.1 C
Munich
Tuesday, July 28, 2026

rajanikanth : ఆసుపత్రిలో చేరిన హీరో రజనీకాంత్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

rajanikanth : ప్రముఖ నటుడు రజనీకాంత్ మంగళవారం చెన్నయ్ లోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఆయన అకస్మాత్తుగా ఇంటిలో అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఆసుపత్రి వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. వెంటనే ఆపరేషన్ చేయాల్సిందిగా కుటుంబసభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఏ మాత్రం ఆలోచించకుండా వైద్య బృందం ఆపరేషన్ కు ఏర్పాట్లు చేసింది. ఆయన కడుపు నొప్పితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పొత్తి కడుపు భాగంలో సర్జరీ చేశారు , సర్జరీ చేసిన భాగంలో స్టంట్ కూడా వేసినట్టు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

ప్రస్తుతం రజనీ కాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆపరేషన్ అయిన తరువాత ఆయన ఆరోగ్యాంగానే కనబడినట్టు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మరో మూడు రోజుల అనంతరం రజనీ కాంత్ ను డీఛార్జ్ చేస్తామని ప్రకటించింది ఆసుపత్రి వైద్య విభాగం. రజనీ కాంత్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలియడంతో దేవాలయాలల్లో పూజలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.