NIGAMA MEDIA (P) LTD
15.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, September 16, 2026

సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావ్ కు విసిరిన సవాల్ ఏమిటి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.మరో ఇరువై రోజుల్లో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగ నుంది.గులాబీ అధినేత కేసీఆర్ తన అభ్యర్థులను ప్రకటించారు. బిజెపి కూడా 17 స్థానాల్లో తన అభ్యర్థులను పోటీలో పెట్టింది. కాంగ్రెస్ ఖమ్మం, హైదరాబాద్,కరీంనగర్ స్థానాలకు నాయకులను ప్రకటించాల్సి ఉంది.బిఆర్ఎస్,బిజెపి ఒంటరిగానే కుస్తీ పడుతున్నాయి. కాంగ్రెస్ కు వేడి నీళ్లకు చలినీళ్ళు తోడు అన్నట్టుగా సీపీఐ,సీపీఎం మద్దతు ప్రకటించాయి.పోటీ మూడు ప్రధాన పార్టీల మధ్యనే నెలకొంది.సీఎం రేవంత్ రెడ్డి కి పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధిష్టానం వద్ద తన సత్తా చూపించుకోడానికి అవకాశం ఉంది.ఒకవేళ అనుకున్న లక్ష్యం రాణి నేపథ్యంలో తన వంద రోజుల పరిపాలనపై ప్రజలు అవిశ్వాసం ప్రకటించినట్టు అవుతుంది.

బిఆర్ఎస్ ను రద్దు చేస్తారా ….
ఆగష్టు 15 తేదీలోపు రెండు లక్షల రూపాయల ఋణం తీసుకున్న ప్రతి రైతు ఋణం మాఫీ చేస్తానని రెండు రోజుల నుంచి తన ఎన్నికల ప్రచార సభల్లో రైతులకు హామీ ఇస్తున్నారు. ఇదే హామీని తప్పక నెరవేర్చి తీరుతానని స్పష్టం చేస్తున్నారు సీఎం.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు తోపాటు, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ మాజీ మంత్రులు రుణ మాఫీ అనేది పెద్ద అబద్దమని ప్రచారం చేస్తున్నారు.రుణ మాఫీ చేయడం సాధ్యం కాదని ఓట్ల కోసమే ఆగష్టు 15 లోగ మాఫీ చేస్తానని సీఎం నమ్మిస్తున్నాడని మాజీ మంత్రులు ప్రచారం చేస్తున్నారు.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు….
ఈ నేపథ్యంలో కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొన్నారు.గులాబీ నాయకులపై తనదయిన శైలిలో విరుచుకుపడ్డారు.బిఆర్ఎస్ నాయకులను తిప్పికొట్టే ప్రయత్నం చేసారు.ఆగష్టు 15 తేదీలోగా రెండు లక్షల లోపు ఋణం తీసుకున్న ప్రతి రైతు ఋణం మాఫీ చేస్తానని మరోసారి కొడంగల్ లో ప్రకటించారు.ఆ తేదీలోపు ఋణం మాఫీచేస్తే మీ భారత రాష్ట్ర సమితిని రద్దు చేస్తారా అని మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.రైతుకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసే భాద్యత తనదేనని స్పష్టం చేసారు. బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని కోరారు.రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేయొద్దని, రైతులకు ఇచ్చిన హామీ, తేదీ ప్రకారం ఋణం మాఫీ చేసితీరుతానని స్పష్టం చేశారు కార్య కర్తల సమావేశంలో.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.