NIGAMA MEDIA (P) LTD
15.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, September 16, 2026

ఆ నాయకుడి ఐదేండ్ల సంపాదన రూ.114.76 కోట్లు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ ప్రతినిధి :
దేశంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు. మరోవైపు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.విజయం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు.పోటీచేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు తమ ఆదాయం,ఖర్చు,మిగులుపాటు,అప్పులు,పోలీస్ కేసులు వివరంగా నామినేషన్ వేసేటప్పుడు అఫిడవిట్ లో పొందుపరిచాలి.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు,సినీ నటుడు మంగళవారం తన నామినేషన్ ను ఎన్నికల కమిషన్ కు సమర్పించాడు. ఈ సందర్బంగ తన అఫిడవిట్ లో తనకున్న అప్పులు,నిల్వ సంపాదన,స్వచ్చంద సంస్థలకు ఇచ్చిన విరాళములు, గడిచిన ఐదేండ్లలో తాను సంపాదించిన సంపాదన కూడా తన అఫిడవిట్ లో వివరించాడు.

జనసేన అధినేత బిజెపి,టిడిపి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. కూటమిగా ఏర్పడి జగన్ ను ఓడించడానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. తన నివాసమైన చేబ్రోలు నుంచి భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లారు.పిఠాపురం నియోజకవర్గంలోని ఎంపిపి కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పాత్రలను అందజేశారు.తన నామినేషన్ అఫిడవిట్ లో గడిచిన ఐదేండ్లలో సంపాదించిన సంపాదన,అప్పులు,నిల్వ,విరాళాలను పేర్కొన్నారు.

గడిచిన ఐదేండ్ల కాలంలో 114.76 కోట్ల రూపాయలను సంపాదించినట్టుగా తన అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ వివరించారు.అదేవిదంగా 64 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ అప్పుల్లో పలు బ్యాంకు ల నుంచి అప్పుగా 17,56,84,453 కోట్ల రూపాయలను తీసుకోవడం జరిగిందన్నారు. తెలిసిన 15 మంది వ్యక్తుల నుంచి 46.70 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నానని తెలిపారు. పవన్ కు అప్పు ఇచ్చిన వారి పేర్లలో చిరంజీవి భార్య,పవన్ వదిన కొణిదెల సురేఖ పేరు కూడా ఉండటం విశేషం, సురేఖ వద్ద రెండు కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నట్టు తెలిపారు.పన్నుల రూపంలో సంబంధిత శాఖలకు 73.92 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు.పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం 17.15 కోట్లు, పలు స్వచ్చంద సంస్థలకు 3.32 కోట్లు, కేంద్రీయ సైనిక్ బోర్డు కు ఒక కోటి రూపాయలు, APCMRF సంస్థకు 50 లక్షల రూపాయలు, తెలంగాణ రాష్ట్ర CMRF కు 50 లక్షల రూపాయలు, శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్ కు 30.11 లక్షల రూపాయలను విరాళముగా అందజేసినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన సందర్భముగా తన అఫిడవిట్ లో వివరించారు.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.