కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి సీనియర్ నాయకులు కారుపాకల రమేశ్ గారి మామగారు ఇటీవల మృతి చెందడంతో, తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొని మృతుడి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు.

