21.4 C
Munich
Monday, July 27, 2026

తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయిన ఎంపీ ఎవరంటే

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ ప్రతినిధి:
దేశంలో మొదటిదశ పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఇంకా పలు నియోజకవర్గాల్లో నామినేషన్ పక్రియ కొనసాగుతోంది. మరికొన్ని నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశ వ్యాప్తంగా జూన్ నాలుగున ఒకేసారి ఫలితాలు వెల్లడికానున్నాయి.దేశంలో ప్రధాన మంత్రి పీఠం కోసం ఇండియా కూటమి,ఎన్డీయే కూటమి మధ్యనే కొనసాగుతోంది.రెండు కూటములు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మూడసారి అధికారం దక్కించుకోవాలని బిజెపి వివిధ రకాల అస్త్రాలను ఉపయోగిస్తోంది.ఇండియా కూటమి కూడా తన దయిన శైలిలో ఓటర్లను ఆకట్టుకుంటోంది.ఈ నేపథ్యంలో మొదటి దశ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగిసింది. అంతేకాదు ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలు కూడా ముగిసాయి.

 

ఏకగ్రీవంగా ఎన్నికయిన ఎంపీ……
గుజరాత్ లోని సూరత్ లోకసభ స్తానం నుంచి బిజెపి అభ్యర్థిగా ముకేశ్ దలాల్, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలేష్ కుంభాని, బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా ప్యారేలాల్ భారతి నామినేషన్ వేశారు.కాంగ్రెస్ పార్టీకి ఏమి అనుమానం వచ్చిందో ఏమోకానీ ముందు జాగ్రతగా సురేష్ పడశాల తో కుడా పార్టీ నామినేషన్ వేయించింది. నామినేషన్ నిబంధనలు,ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం బీఎస్పీ అభ్యర్థి భారతి నామినేషన్ తిరస్కరణకు గురైనది.అదేవిదంగా ముందుజాగ్రత్తగా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ వేసిన రెండో నామినేషన్ కూడా తిరస్కరణకు గురైనది.నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో బిజెపి అభ్యర్థి దాఖలు చేసిన అఫిడవిట్ సక్రమంగానే ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయనతోపాటు పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ పాత్రలను కూడ పరిశీలించారు. కుంభాని పత్రాలపై తాము సంతకాలు చేయలేదని బలపరిచిన ముగ్గురు వ్యక్తులు ఎన్నికల అధికారి ఎదుట హాజరయ్యేందుకు నిరాకరించారు. దింతో కాంగ్రెస్ అభ్యర్థి కుంభాని నామినేషన్ పత్రాలను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది.దింతో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ముకేశ్ దలాల్ ను సూరత్ ఎంపీ గ ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దింతో దేశంలో బిజెపి ఎంపీ అభ్యర్థుల గెలిచిన వారి జాబితాలో దలాల్ మొదటి స్థానంలో నిలిచాడు.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

 

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.