Home » CPI : సీపీఐ శతజయంతి పోస్టర్ విడుదల

CPI : సీపీఐ శతజయంతి పోస్టర్ విడుదల

CPI : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సవాల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ …..

పార్టీ నిర్మాణమై వంద సంధర్భాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలకు 40 కి పైగా వివిధ దేశాల పార్టీ ప్రతినిధులు హాజరు కానున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఒక రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభకు హాజరై పార్టీతో ఉన్న తన అనుబంధం గురించి మాట్లాడుతారన్నారు. ఖమ్మంలో ఈ నెల 18న భారీ ఎత్తున ప్రదర్శన, అనంతరం సభ, సభలో పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పై పలు తీర్మానాలు, ఇప్పటి వరకు పార్టీ సాధించిన ఘన విజయాల గురించి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు మంచిర్యాల జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, డి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు డిఆర్ శ్రీధర్, బి కే ఎం యు జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, నాయకులు బొంకూర్ రామచందర్, రత్నం ఐలయ్య, ఇనుముల రాయమల్లు, లింగాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *