Kavitha : తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నవి. బిఆర్ఎస్ ప్రధాన నేతలు కేటీఆర్, హరీష్ రావులను సిట్ అధికారులు విచారించారు. వీరిద్దరి తరువాత కేసీఆర్ అంటూ సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమన్నవి. కానీ కేసీఆర్ కంటే ముందుగా కవిత దంపతుల వైపు సిట్ దృష్టి పెట్టినట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ కు కొద్దిరోజుల్లోనే నోటీసులు ఇచ్చేందుకు సిట్ సన్నద్ధమైన్నట్టు రాష్ట్రంలో ప్రచారం మొదలైనది. అధినేత కేసీఆర్ కంటే ముందు అయన కుటుంబ సభ్యులను విచారించి సమాచారం రాబట్టాలని సిట్ అధికారుల ఆలోచన ఉన్నట్టు సమాచారం.
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించడానికి ముందు ఆయన కుటుంబ సభ్యులను విచారిస్తేనే కేసుకు బలమైన సమాచారం లభిస్తుందనేది సిట్ ఆలోచన. ఈ నేపథ్యంలోనే ముందుగా కేటీఆర్, హరీష్ రావు లను విచారణకు పిలిచారు. ఇప్పుడు కవిత తో పాటు ఆమె భర్తను విచారించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. కవిత దంపతులను విచారిస్తోరో లేదో తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం గుసగుసలు మొదలైనాయి.
ఫోన్ ట్యాపింగ్ సమస్య కేసీఆర్ కుటుంబానికి పెద్ద గుదిబండ అయ్యింది. ఏం సాధించడానికో, ఎవరి స్వలాభం కోసం ట్యాపింగ్ చేయించారో కానీ ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా పోయిందనే అభిప్రాయాలు రాజకీయ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. చట్టపరంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఎటువైపు దూసుకెళ్తుందో అంతుపట్టడం లేదు. కానీ అధినేత కేసీఆర్ కుటుంబానికి మోయలేనంత బరువును మాత్రం తెచ్చిపెట్టిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

by