CPI : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ముప్పయ్ మందికి పైగా యువకులు సీపీఐ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకున్నారు. వీరికి పార్టీ సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ సభ్యత్వం అందజేశారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ డి ఆర్ శ్రీధర్ ఆధ్వర్యంలో, బెల్లంపల్లి బస్తీకి చెందిన బడికెల అవినాష్ నాయకత్వంలో వీరు పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల పార్టీ ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసి ప్రజలకు ఎన్నో హక్కులను సాధించిపెట్టిందన్నారు. అదే విదంగా కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి సాధించి పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు గుండా చంద్రమాణిక్యం, రత్నం రాజం, బొంతల లక్ష్మీనారాయణ, నాయకులు కామెరాదుర్గయ్య గార్లు పాల్గొన్నారు.

by