Home » Sweet potato : చిలగడ దుంప తింటే ఆరోగ్య సమస్యలన్నీ మాయం

Sweet potato : చిలగడ దుంప తింటే ఆరోగ్య సమస్యలన్నీ మాయం

Sweet Potato : చిలగడ దుంపకు ప్రాంతాల వారిగా పేర్లు ఉన్నవి. దీన్ని ఉడుకపెట్టుకొని తింటారు. కొందరు కూర వండుకొని కూడా తింటారు. కూరలో ఫ్రై, పులుసు కూడా తయారు చేస్తారు. ఈ దుంప ఎక్కువ శాతం జనవరి నుంచి మార్చి వరకు ఎక్కువగా మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది.

గుండె పనితీరు మెరుగవుతుంది. అధిక రక్తపోటుని నివారిస్తుంది.

విటమిన్-ఏ పుష్కలంగా ఉంటుంది. దీనివలన కంటి చూపు మెరుగవుతుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల ఎదుగుదలను నిరోధిస్తుంది.

జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

పొటాషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *