హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ.
జర్నలిస్టులు, క్రీడాకారుల హర్షం
కోల్ బెల్ట్ న్యూస్ క్రీడాప్రతినిధి:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మంచిర్యాల జిల్లా టీయూడబ్ల్యూజే–ఐజేయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు పలువురు జర్నలిస్టులు, క్రీడా రంగ ప్రముఖులను ఘనంగా సన్మానించారు. క్రీడలు, జర్నలిజం రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతినిధులను ఒకే వేదికపై అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, ప్రధాన కార్యదర్శి అల్గువెల్లి రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు మద్దెల సంజీవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి శ్రీధర్ తదితరులను హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, సంఘం చైర్మన్ సలహాదారు హెచ్. రవీందర్, మల్లమరి మండల హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు బీదునూరి శంకర్, హ్యాండ్‌బాల్ కోచ్ సునాకర్ అరవింద్, జాతీయస్థాయి న్యాయనిర్ణేతలు జి. సాయి, రాజశేఖర్, కార్తీక్లను కూడా సన్మానించారు.క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన పులిశెట్టి శృతి, దొంతుల వర్షా, అలాగే పీడీ సంతోష్లను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్‌లో మరింత మంది యువత క్రీడల వైపు ఆకర్షితులవుతారని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిజం సమాజానికి సమాచార వారధిగా పనిచేస్తుండగా, క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జర్నలిస్టులు, క్రీడాకారులు పరస్పరం సహకరించుకుంటూ తమ తమ రంగాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం, జర్నలిస్టుల సేవలకు గుర్తింపు కల్పించేలా నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. హ్యాండ్‌బాల్ క్రీడకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గజ్జల చందర్, కళ్యాణి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాంవేణుతో పాటు పలువురు పాత్రికేయ మిత్రులు, హ్యాండ్‌బాల్ క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు.

