NIGAMA MEDIA (P) LTD
16.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 3, 2026

గాంధీజీ ఆశయాలను ఆచరించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ.. సత్యాగ్రహాన్ని ఆయుధంగా, అహింసా మార్గాన్ని సిద్ధాంతంగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, అహింస వంటి శాంతియుత మార్గాల ద్వారా ప్రజల హక్కుల కోసం పోరాడే విధానాన్ని గాంధీజీ దేశానికి చూపించారని పేర్కొన్నారు.

సాదాసీదా జీవన విధానాన్ని అవలంబించిన గాంధీజీ స్వదేశీ భావనను ప్రోత్సహించడంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానమేనన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని చాటిన మహనీయుడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మేనేజర్ టి. రాజేశ్వరి, సీనియర్ అసిస్టెంట్ ఈ. రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్లు వినయ్, శ్యామ్యుల్, ప్రదీప్ కుమార్, 24 వార్డుల వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, ఎలక్ట్రిషియన్ కుమారస్వామి, ఇన్‌చార్జి టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఏనుగు రఘురాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. గోపికృష్ణ, సిస్టమ్ మేనేజర్ ఏ. శిరీష్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ బొల్లు శ్యాంబాబు తదితర మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.