గాంధీజీ ఆశయాలను ఆచరించాలి
మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ.. సత్యాగ్రహాన్ని ఆయుధంగా, అహింసా మార్గాన్ని సిద్ధాంతంగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, అహింస వంటి శాంతియుత మార్గాల ద్వారా ప్రజల...