NIGAMA MEDIA (P) LTD
8.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, November 19, 2026

ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సింగరేణి పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు”
విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన జీఎం ఎడ్యుకేషనల్
సింగరేణి జీఎం ఎడ్యుకేషనల్ రాజేంద్రప్రసాద్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సింగరేణి జనరల్ మేనేజర్ ఎడ్యుకేషనల్ (కార్పొరేట్)  రాజేంద్రప్రసాద్ సూచించారు. మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్, జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని ఆయన తొలిసారిగా సందర్శించారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు.

అనంతరం సింగరేణి హైస్కూల్‌ను సందర్శించిన రాజేంద్రప్రసాద్ పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు పలు విలువైన సూచనలు చేశారు.ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో భాషా నైపుణ్యాలను పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా LSRW (Listening, Speaking, Reading, Writing) నైపుణ్యాలను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థుల్లో గణిత సామర్థ్యాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి విద్యార్థి పట్టుదలతో నేర్చుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.

త్వరలో బస్సులు, డిజిటల్ బోర్డులు

పాఠశాల అభివృద్ధిలో భాగంగా విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం స్కూల్ బస్సులు ఇప్పటికే వచ్చాయని, త్వరలోనే విద్యార్థులకు బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే పాఠశాలను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ బోర్డులు, ఆధునిక కంప్యూటర్లను త్వరలో సమకూర్చనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అశోక్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏజీఎం (ఎఫ్‌అండ్‌ఏ) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, డీజీఎం (పర్సనల్) సి.హెచ్. అశోక్, కేకేఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, డీజీఎం (ఐడీ) కిరణ్ కుమార్, పర్చేస్ ఆఫీసర్ బాబు, సీనియర్ పీఓలు, సింగరేణి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జె. పురుషోత్తం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.