NIGAMA MEDIA (P) LTD
8.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 24, 2026

కేకే ఓసీపీలో ఉత్పత్తి వేగం పెంచాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

భద్రతతో కూడిన ఉత్పత్తికే ప్రాధాన్యం ఇవ్వాలి: సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వరులు

మందమర్రి: మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌ (కేకే ఓసీపీ)ను సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) కె. వెంకటేశ్వరులు బుధవారం సాయంత్రం సందర్శించారు. కార్పొరేట్ సిపి అండ్ పి అధికారి ఏ. మనోహర్, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణతో కలిసి ప్రతినిధి బృందంతో గనిని పరిశీలించారు.

ఈ సందర్భంగా గనిలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, నాణ్యతా ప్రమాణాలు, రవాణా మార్గాలు, కార్మికుల భద్రతా చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత త్రైమాసికానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా చేరుకునేందుకు ఉత్పత్తి వేగాన్ని మరింత పెంచాలని డైరెక్టర్ సూచించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గనుల్లో సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు అందించవచ్చని తెలిపారు. అనంతరం ఎక్స్‌ప్రెస్‌వే ఓబీ (ఓవర్‌బర్డెన్) కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై ఓబీ తొలగింపు పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పరిష్కరించుకుని పనులను కొనసాగించాలని సూచించారు.

‘భద్రతతో కూడిన ఉత్పత్తే సమర్థవంతమైన ఉత్పత్తి’ అని పేర్కొన్న డైరెక్టర్.. ఉత్పత్తికి ఎంత ప్రాధాన్యత ఉందో కార్మికుల భద్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షిత వాతావరణంలో పనిచేసేలా అధికారులు అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

సింగరేణి సంస్థ అభివృద్ధిలో ప్రతి కార్మికుడి పాత్ర కీలకమని, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది సమన్వయంతో ఒకే లక్ష్యంతో పనిచేసినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను సులభంగా చేరుకోగలమని అన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు గని పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

  1. ఈ పర్యటనలో కేకే ఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, సేఫ్టీ అధికారి పైడయ్య, ఎస్‌అండ్‌పీసీ (ఏఎస్‌ఓ) వెంకటేశ్వరరెడ్డి, కేకే ఓసీపీ అధికారులు, ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.