NIGAMA MEDIA (P) LTD
3.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, November 16, 2026

632 మందికి నూతన చేయూత పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

లక్షెట్టిపేట్ మండల, మున్సిపాలిటీ పరిధికి చెందిన 632 మంది చేయూత పెన్షన్ లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరి పత్రాలను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎంపీఓ, ఎంపీడీఓ ఇన్‌చార్జి అనిల్‌తో పాటు సంబంధిత అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక చొరవతో లక్షెట్టిపేట్ మండల, మున్సిపాలిటీ పరిధిలోని 632 మందికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎమ్మెల్యే నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే తమ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి-వెంకటస్వామి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ శాంతరాశి రాజేష్, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ కేతిరెడ్డి సత్తిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, సర్పంచ్ నలిమెల రాజు, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాహిద్ అలీ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.