బహిరంగ సభలో ఇందిరమ్మ భీమా పథకం ప్రకటన
రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
సిద్దిపేటలో ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ భీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించనున్నట్లు సమాచారం.
ఈ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. అనుకోని ప్రమాదాలు, ఆపద సమయాల్లో బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేలా ఈ పథకం ఉపయోగపడనుంది. ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. ఈ సభ వేదికగా ఇందిరమ్మ భీమా పథకంపై సీఎం చేసే ప్రకటనపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

