కేకే ఓసీపీలో ఉత్పత్తి వేగం పెంచాలి
భద్రతతో కూడిన ఉత్పత్తికే ప్రాధాన్యం ఇవ్వాలి: సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వరులు మందమర్రి: మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ (కేకే ఓసీపీ)ను సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) కె. వెంకటేశ్వరులు బుధవారం సాయంత్రం సందర్శించారు. కార్పొరేట్ సిపి అండ్ పి అధికారి ఏ. మనోహర్, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణతో కలిసి ప్రతినిధి బృందంతో గనిని పరిశీలించారు. ఈ సందర్భంగా గనిలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, నాణ్యతా ప్రమాణాలు, రవాణా మార్గాలు, కార్మికుల భద్రతా చర్యలను...