NIGAMA MEDIA (P) LTD
7.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 22, 2026

క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, జీఎం కార్యాలయ సీనియర్ పీఓ సందీప్ అన్నారు. కలలు, కళలు సమాజ వికాసానికి, మానసిక ఆనందానికి ప్రతీకలని, ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆదివారం మందమర్రి సింగరేణి పాఠశాల ఆవరణలోని యోగా హాల్‌లో నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ క్రీడలు, సాంస్కృతిక పోటీలను ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, కేకే ఏజెంట్ ఖదీర్, జీఎం కార్యాలయ సీనియర్ పీఓ సందీప్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధుల్లో నిరంతరం బిజీగా ఉండే సింగరేణి ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉత్తేజాన్ని అందించడంతో పాటు ఉద్యోగుల్లో క్రమశిక్షణ, సమైక్యతా భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.పోటీల్లో గెలుపోటముల కంటే పాల్గొనడం, క్రీడా స్ఫూర్తితో ప్రతిభను ప్రదర్శించడం ముఖ్యమన్నారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఏరియా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.

అలాగే సింగరేణి ఉద్యోగుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను వెలికితీయడానికి సాంస్కృతిక పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. సంగీతం, నాటకం, నృత్యం వంటి కళలు ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు అందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తాయని అన్నారు. కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా  ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎగ్గేటి రాజేశ్వర్, పెద్దపల్లి బాలయ్య, డబ్ల్యూపీఎస్‌జీఏ కోఆర్డినేటర్ శివ, జనరల్ కెప్టెన్ సాక శ్రీను, కల్చరల్ కెప్టెన్ సాధన వేణి ప్రభాకర్‌తో పాటు సీనియర్ కళాకారులు, క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.