క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, జీఎం కార్యాలయ సీనియర్ పీఓ సందీప్ అన్నారు. కలలు, కళలు సమాజ వికాసానికి, మానసిక ఆనందానికి ప్రతీకలని, ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆదివారం మందమర్రి సింగరేణి పాఠశాల ఆవరణలోని యోగా హాల్‌లో నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ క్రీడలు, సాంస్కృతిక పోటీలను ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ,...