NIGAMA MEDIA (P) LTD
26 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, August 19, 2026

బీబీపేట–ఉప్పరపల్లి రహదారికి బీటీ రోడ్డు నిర్మించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ముఖ్యంగా బీబీపేట నుంచి ఉప్పరపల్లి మీదుగా రామంపేట వైపు వెళ్లే రహదారిపై భారీగా గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిందని తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నర్సింహులు అన్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలవడంతో రహదారి పరిస్థితి కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించకుండా ముందుగానే అధికారులు చర్యలు తీసుకుని వెంటనే బీటీ రోడ్డు నిర్మించాలని కోరారు.

అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలపై అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని నర్సింహులు సూచించారు. పార్టీ జెండాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాల కోసం ఏకతాటిపైకి వచ్చి రోడ్డు నిర్మాణానికి సహకరించాలని కోరారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.