కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మండల నిరుద్యోగ యువతీ, యువకులకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మూడు నెలలపాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక, గనుల, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చొరవతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ప్రముఖ ఫ్యాకల్టీతో శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.
ఆసక్తి ఉన్న యువతీ, యువకులు ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటల నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు కేంద్రం మందమర్రి ఎం.ఆర్.ఓ. కార్యాలయం ఎదురుగా ఉన్న షెడ్డులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు పసునూటి రాము 9676448649, వడ్డూరి సునీల్ కుమార్ 9676067787, శనిగారపు సాగర్ 6301202909 నంబర్లను సంప్రదించాలని కోరారు.

