బీబీపేట–ఉప్పరపల్లి రహదారికి బీటీ రోడ్డు నిర్మించాలి

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ముఖ్యంగా బీబీపేట నుంచి ఉప్పరపల్లి మీదుగా రామంపేట వైపు వెళ్లే రహదారిపై భారీగా గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిందని తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నర్సింహులు అన్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలవడంతో రహదారి పరిస్థితి కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించకుండా ముందుగానే అధికారులు చర్యలు తీసుకుని వెంటనే బీటీ రోడ్డు నిర్మించాలని కోరారు. అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలకు...