NIGAMA MEDIA (P) LTD
17.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

బీబీపేట్ అభివృద్ధికి సహకారం అందిస్తాం: షబ్బీర్ అలీ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బీబీపేట్ గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం
బీబీపేట్ సమస్యలను షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్, పాలకవర్గం
బీబీపేట్‌కు వెటర్నరీ ఆస్పత్రి మంజూరు.. శాంక్షన్ లెటర్ అందించిన షబ్బీర్ అలీ
గ్రామాభివృద్ధిపై చర్చ.. షబ్బీర్ అలీని కలిసి వినతిపత్రం అందజేసిన బీబీపేట్ సర్పంచ్
బీబీపేట్ అభివృద్ధి పనులపై సానుకూలంగా స్పందించిన షబ్బీర్ అలీ

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహాదారు షబ్బీర్ అలీని ఆదివారం ఆయన నివాసంలో బీబీపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. బీబీపేట్ గ్రామ సర్పంచ్ సాద్విక సాయినాథ్ మాట్లాడుతూ, గ్రామంలోని బురుజు సమీపంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటు, గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం, బ్రిడ్జి వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న బీటీ రోడ్డు మరమ్మతులు తదితర అభివృద్ధి పనులను చేపట్టాలని కోరుతూ వినతిపత్రం (మెమోరాండం) అందజేసినట్లు తెలిపారు.

వినతిపత్రంపై షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందిస్తూ, గ్రామ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే సందర్భంగా బీబీపేట్ గ్రామానికి వెటర్నరీ ఆసుపత్రి మంజూరుకు సంబంధించిన శాంక్షన్ లెటర్‌ను సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాద్విక సాయినాథ్, వార్డ్ సభ్యులు మొహమ్మద్ ఆసిఫ్, పరకాల రవి, లక్ష్మీనారాయణ, మహేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.