NIGAMA MEDIA (P) LTD
8.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 31, 2026

ఖమ్మంలో అట్టహాసంగా రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మూడు రోజుల పాటు పోటీల నిర్వహణ
క్రీడా పోటీలతో యువ క్రీడాకారులకు ప్రోత్సాహం
ఓటమి ముందస్తు విజయానికి సూచిక
ఖమ్మం జిల్లా డివైస్ ఓ సునీల్ రెడ్డి

కోల్ బెల్ట్ న్యూస్ క్రీడా ప్రతినిధి:

ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమైనాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డివైస్ ఓ సునీల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మొదటగా జిల్లాకు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలను కేటాయించిన రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం వల్ల క్రీడా మైదానాలు వసతులు అభివృద్ధి చెందుతాయని, యువ క్రీడాకారులకు ప్రోత్సాహకారంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని జాతీయ స్థాయి క్రీడాకారులను కాకుండా ఒలంపిక్ క్రీడాకారులను తయారుచేయలని సంకల్పంతో క్రీడా బడ్జెట్ కు ప్రాధాన్యతనిస్తూ కేటాయించిందని ఆయన తెలిపారు.

ఖమ్మం జిల్లా చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు క్రీడాభివృద్ధికి ప్రాధాన్యతరిస్తున్నారని అనేక ఇండోర్ స్టేడియాలను క్రీడా మైదానం ఏర్పాటు చేసుకోవడానికి బడ్జెట్ కేటాయించి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇందుకు ఆయన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు కోచ్ లను ముఖ్యంగా క్రీడాకారుల క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులను అభినందించారు.
రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు సహకరిస్తున్న అందరికీ ముఖ్యంగా హ్యాండ్ బాల్ కోర్టుకు పర్మనెంట్ ఫ్లాడ్ లైట్స్ ను ఏర్పాటు చేసిన జిల్లా డి వై ఎస్ ఓ సునీల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ సెలక్షన్ చేయబడ్డ రాష్ట్ర హ్యాండ్ బాల్ జూనియర్ బాలికల జట్టు నవంబర్ లో పంజాబ్ లోని సంగృర్ లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన వివరించారు.

ఈ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు పది జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు, జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతగా 15 మంది, రాష్ట్ర సంఘం పదాధికారులు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఈ పోటీల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ క్రీడల్లో పాల్గొన్న వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పించారు. శనివారం ప్రారంభమైన ఈ పోటీలు మూడు రోజులు కొనసాగుతాయని, ఈ పోటీలు లీక్ కం నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శ శ్యామల పవన్ కుమార్ తెలిపారు. మొత్తం 10 జట్లు పాల్గొనగా రెండు పూల్స్ గా 24 లీగ్ మ్యాచులు నిర్వహిస్తామని అందులో మొదటి రోజున పది మ్యాచులు నిర్వహించామని పవన్ కుమార్ వివరించారు.

10 లీగ్ మ్యాచ్ల స్కోర్లను, గెలుపొందిన జట్లను ఆయన ప్రకటించారు. లీగ్ మ్యాచ్ ల జిల్లా జట్ల స్కోర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

వరంగల్ , నిజామాబాద్ జట్లు తలపడగా 13-1 తో వరంగల్ జట్టు విజయం సాధించింది
మహబూబ్ నగర్ , మెదక్ జట్టు తలపడగా 25-8 గోల్స్ మహబూబ్ నగర్ జట్టు విజయం సాధించింది.
ఖమ్మం, రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన పోరులో 18-8 గోల్స్ తో ఖమ్మం జట్టుని విజయం వరించింది.
ఆదిలాబాద్, కరీంనగర్ జట్ల మధ్య జరిగిన పోటీలో 22-7 గోల్స్ తో ఆదిలాబాద్ జట్టుకు విజయం వరించింది
వరంగల్ , మెదక్ జట్ల మధ్య జరిగిన పోటీలో 22-3 గోల్స్ తో వరంగల్ జట్టు విజయం సాధించింది
నల్గొండ, ఖమ్మం జట్ల మధ్య జరిగిన పోటీలో 2-17 గోల్స్ తో ఖమ్మం జట్టు గెలుపొందింది.
వరంగల్, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోటీలో 16-7 తో వరంగల్ జట్టు గెలుపొందింది
మహబూబ్నగర్, నిజామాబాద్ జట్లు తలపడగా 23-2 గోల్స్ తో మహబూబ్నగర్ జట్టు విజయం సాధించింది.
ఆదిలాబాద్, రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన పోటీలో 18-11 గోల్స్ తో ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది
హైదరాబాద్, మెదక్ జట్ల మధ్య జరిగిన పోటీలో 16-9 గోల్స్ తో హైదరాబాద్ జట్టు విజయం అందుకుంది.
ఖమ్మం – కరీంనగర్ జట్ల మధ్య జరిగిన పోటీల్లో 18 0 4 గోల్స్ తేడాతో ఖమ్మం జట్టు విజయం సాధించింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఖమ్మం dyso సునీల్ రెడ్డి, ఖమ్మం జిల్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుట్ట శంకరయ్య, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసిషన్ ప్రధాన కార్యదర్శి మరియు హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి సామల పవన్ కుమార్, స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ పరిశీలకులు దీపక్ కుమార్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి లక్స్మన్ , హైదరాబాద్ కార్యదర్శి సుదర్శన్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి తిరుణాల్, మహబూబ్ నగర్ కార్యదర్శి శంకర్, జాతీయస్థాయి రిఫరీలు సునార్కర్ అరవింద్, సుదీర్, వెంకటేష్, రాజశేఖర్ ,ఖమ్మం జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ వైస్ చైర్మన్ టి సుధీర్ , ఖమ్మం జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బి అశోక్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి మోహన్, గోవిందరెడ్డి తదితరులు ఉన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.