20.9 C
Munich
Sunday, July 26, 2026

బావ కళ్ళల్లో ఆనందం కోసమేనా కమ్యూనిస్టుల పొత్తు ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

రాష్ట్రమంతటా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసుతో కమ్యూనిస్టుల పొత్తు
క్యాతనపల్లిలో గులాబీ పార్టీతో దోస్తానా
మంచిర్యాలలో ఒక్క స్థానంతో ఎందుకు సరిపెట్టుకున్నరు
క్యాతనపల్లిలో ఒకటి కంటే ఎక్కువ స్థానాలు ఎందుకు కాదన్నారు
ఎర్రజెండా శ్రేణులతోపాటు రాజకీయ వర్గాల్లో అనుమానాలు

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

ఇటీవల రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా ముగిసాయి. అధికార పార్టీ అత్యధిక స్థానాల్లో జెండా ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తుపెట్టుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఆనవాయితీనే కమ్యూనిస్టులు మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించారు. కానీ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అందుకు విరుద్దంగా జరిగింది. ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కమ్యూనిస్టు ప్రధాన నేతలు వ్యవహరించిన తీరుపై ఎర్రజెండా శ్రేణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి చెన్నూర్ నియోజకవర్గంలో విడిపోయారు. మంచిర్యాల లో కలిసి పనిచేశారు. మంచిర్యాల కార్పోరేషన్ లో ఒకే ఒక్క స్థానంతో సీపీఐ సరిపెట్టుకుంది. అదే క్యాతనపల్లిలో ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే మాత్రం సీపీఐ నేతలు ఒప్పుకోలేదు. మంచిర్యాల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకోవడం, క్యాతనపల్లిలో తిరస్కరించడం పై రాజకీయ శ్రేణులతో పాటు సీపీఐ శ్రేణుల్లో కూడ అనుమానాలు తలెత్తుతున్నాయి.

చెన్నూర్ నియోజక వర్గంకు చెందిన మంత్రి వివేక్ ను రాజకీయంగా దెబ్బతీయడానికే మంచిర్యాల జిల్లాకు చెందిన అధికార పార్టీ కి చెందిన ఒక కీలక నేత ఒత్తిడితోనే కమ్యూనిస్టులు బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతూన్నాయి. అదే విధంగా బిఆర్ఎస్ లో ప్రధాన నేతకు, సీపీఐలో మరొక ప్రధాన నేతకు ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉంది. బావ, అంటే బావ అంటూ మర్యాద ఇచ్చుపుచ్చుకునే సంబంధం ఉంది. ఆ బావ కళ్ళల్లో ఆనందం చూడటానికే క్యాతనపల్లిలో ఆ కమ్యూనిస్టు నేత పొత్తుకు పావులు కదిపినట్టుగా అభిప్రాయాలు సైతం మంచిర్యాల జిల్లాలోని రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం కొసమెరుపు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.