NIGAMA MEDIA (P) LTD
23.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

బహుజనుల అభ్యున్నతికి జీవితాన్నే అంకితం చేసిన బన్న ఆశన్న

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

  • ప్రజల మనిషి బన్న ఆశన్న జయంతి జులై 20
  • విద్యతోనే బహుజనుల విముక్తి సాధ్యమని నమ్మిన బన్న ఆశన్న
  • పేదల అభ్యున్నతికి పరితపించిన బన్న ఆశన్న సేవలు చిరస్మరణీయం
  • కాసిపేట విద్యాభివృద్ధికి పునాది వేసిన బన్న ఆశన్న
  • అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన బన్న ఆశన్న

కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):

నీకోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు’ అన్న బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సూక్తులను నిజం చేస్తూ బన్న ఆశన్న నిరంతరం పేద ప్రజల కోసం,బహుజనుల అభివృద్ధి కోసం పరితపించాడు.బహుజనుల పిల్లలు విద్య నేర్చుకుంటే గౌరవంగా జీవిస్తారని విద్యాభివృద్ధి కోసం ఎనలేని సేవలు చేసిన బన్న ఆశాలు జయంతి నేడు. కాసిపేట గ్రామానికి చెందిన బన్న రాజయ్య- అంకమ్మ దంపతులకు 20 జులై 1935 బన్న ఆశాలు జన్మించారు.ముగ్గురు అన్నదమ్ములు ఒక చెల్లెలు.తండ్రి రాజం రైల్వే ఉద్యోగి కావడంతో ఆశలు చదువు కూడా వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. బెల్లంపెల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి,సి ఎస్ ఐ పాఠశాలలో HSC వరకు చదివి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేశారు.

కుటుంబ పోషణ కోసం 1956లో స్థానిక భూస్వామి పోలీస్ పటేల్ సూర్యప్రకాష్ రావు వద్ద వంశపారంపర్యంగా వస్తున్న సుంకరి (వీఆర్ఏ) గా పనిలో చేరాడు. పలు కారణాలతో సుంకరి ఉద్యోగం చేయలేదు. ఆ తరువాత గ్రామంలో ఒకరి వద్ద పాలేరుగా చేరారు. చదువుకొని పాలేరు పని చేయడం మనసొప్పక పని మానేసి మందమర్రిలో కాంట్రాక్టర్ల వద్ద కూలి పనికి వెళ్ళాడు. 1966లో సింగరేణి సోమగూడెం ఒకటో గనిలో లాడిసు కార్మికుడిగా విధుల్లో చేరి అనతి కాలంలోనే షార్ట్ ఫైరర్ గా పదోన్నతులు పొందాడు.

1959 వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి వరకే ఉండేది. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చందాలు జమచేసి ప్రభుత్వ అనుమతి తీసుకువచ్చి కాసిపేట మండలంలో విధాయభివృద్దికి కృషిచేశారు ఆశాలు. పేద ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న ఆశాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజా నాయకుడైన బన్న ఆశన్న ను అంత మొందించేందుకు కొందరు అగ్రకుల పెత్తందర్లు నకిలీ నక్సలైట్ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 6 జూన్ 1990 లో సోమగూడెం పాతబస్తీకి చెందిన నకిలీ నక్సలైట్ ముఠా రాత్రి ఇంటిపై దాడి చేసి ఆశన్న రెండు కాళ్ళు విరగ్గొట్టారు.

మండలంలోని గ్రామాల్లో ఉన్న సమస్యల పరిస్కారం కోసం మూడు రోజులు,124 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రజలకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు ఆశాలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమానికి అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేశారు. మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి తో పాటు ఆయన తనయులు వివేక్, వినోద్ ల గెలుపు కోసం కృషిచేశారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో కూడా ఆశాలు స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తారనే పేరు బన్న ఆశాలుకే కాసిపేట మండలంలో దక్కడం విశేషం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.