NIGAMA MEDIA (P) LTD
8.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 31, 2026

తెలంగాణలో బీజేపీ సమరశంఖం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నవంబర్ 2న హైదరాబాద్‌లో ‘మహా పాదయాత్ర’
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు
భారీ జనసమీకరణకు పార్టీ శ్రేణుల సన్నాహాలు
బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజకీయ మార్పు లక్ష్యంగా నవంబర్ 2న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్ర కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ శనివారం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 2న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మహా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయికి చెందిన పలువురు బీజేపీ ముఖ్య నాయకులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయని చెప్పారు.

ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంపొందించడం, ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రజనీష్ జైన్ పేర్కొన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్ నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా మోంబంజాపా మార్కెట్ క్రాస్ రోడ్స్ వరకు కార్యక్రమానికి సంబంధించిన మార్గాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. మహా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని రజనీష్ జైన్ వెల్లడించారు.లక్ష మంది హైదరాబాద్ ప్రజలతో కలిసి ఈ చారిత్రాత్మక మహా పాదయాత్రకు నాయకత్వం వహించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు పూర్తి ఉత్సాహంతో సన్నద్ధమయ్యారు.రాజ్యాంగబద్ధమైన సంస్థలపై నిరంతరం దాడులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రజనీష్ జైన్ ఈ సందర్బంగా తెలిపారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.