Home » Singareni : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేస్తున్న పెనాల్టీ సిస్టం రద్దు చేయాలి.

Singareni : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేస్తున్న పెనాల్టీ సిస్టం రద్దు చేయాలి.

Singareni : సింగరేణి సంస్థలో విధులు పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జీ ఓ ప్రకారంగా వేతనాలు సీఎం పిఎఫ్, బోనస్, వైద్యం చట్టబద్ధ హక్కులు అమలు చేయాలనిన కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (SCCWU-IFTU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, IFTU రాష్ట్ర నాయకులు ఈ నరేష్ లు సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ కు గోదావరి ఖనిలో వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ …….

కాంట్రాక్ట్ కార్మికుడు ఒక్కరోజు విధులకు గైర్హాజరు అయితే అతని ఒకరోజు వేతనము నుండి రూ : 720 కోత విధిస్తున్నారని వారు ఆరోపించారు. దింతో కార్మికుడు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాలపరిమితి ముగిసిన టెండర్లను సింగరేణి యాజమాన్యం కొనసాగించడం పై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మల్లి టెండర్ల ద్వారానే కాంట్రాక్టు కార్మికులను ఎంపిక చేసే విదంగా యాజమాన్యం తన ఉత్తర్వులను సవరించాలని వారు డిమాండ్ చేశారు.

అదేవిధంగా నర్సరీ లో పనిచేస్తున్న కార్మికులకు అతి తక్కువ వేతనాలు పంపిణీ చేస్తున్నారని, వారికి నిబంధనల మేరకు వేతనాలు మంజూరు చేయాలనీ వారు ఈ సందర్బంగ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు జీవో ప్రకారం వేతనాలతో పాటు సీఎం పిఎఫ్, బోనస్, వైద్యం, చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని ఈ సందర్బంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంను కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *