NIGAMA MEDIA (P) LTD
21.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

AITUC : సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సింగరేణిలో 360 ఖాళీలు
నియామకం చేపట్టకపోవడమై అసంతృప్తి
ఖాళీల భర్తీకి ఏఐటీయూసీ డిమాండ్

AITUC : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్నఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు యజమాన్యంను డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా లు శ్రీరాంపూర్ లోని యూనియన్ కార్యాలయంలో మాట్లాడుతూ ……

యాజమాన్యం గత ఏడాది దాదాపు 360 ఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయని ప్రకటించడంతో సంస్థలో అర్హత గల కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. వాటిని భర్తీ చేయడానికి యాజమాన్యం నేటికీ కూడా నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశలు పెట్టుకున్న కార్మిక వర్గం కూడా అసంతృప్తితో ఉందన్నారు. సింగరేణి విస్తరించిన ఏరియాల్లో జూనియర్ అసిస్టెంట్ ల కొరత ఉన్నప్పటికీ యాజమాన్యం కాలయాపన చేయడం సరికాదన్నారు.

ఖాళీలు భర్తీ చేయక పోవడంతో ప్రస్తుత జూనియర్ అసిస్టెంట్ లపై పనిభారం పెరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడేంత క్లర్క్ లు లేకపోవడంతో జనరల్ మజ్దూర్ లతో యాజమాన్యం పనిచేయిస్తోందని వారు ఆరోపించారు. ఈ విదంగా ఇతరులతో పని చేయించడం వలన నష్టాలు జరిగితే భాద్యులు ఎవరని వారు యజమాన్యంను ప్రశ్నించారు. వెంటనే యాజమాన్యం స్పందించి ఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కిషన్ రావ్, సహాయ కార్యదర్శి మోతుకూరి కొమురయ్య, క్లరికల్ స్టాఫ్ ఇంచార్జిలు బద్రి బుచ్చయ్య, గొల్లపల్లి రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.